తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామ పరిధిలో పాత్రికేయుడు దారుణ హత్యకు గురయ్యాడు. తొండంగిలో ఓ పత్రికకు విలేకరిగా పని చేస్తున్న కాటా సత్యనారాయణ పని ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో విలేకరి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :