తూర్పుగోదావరి జిల్లా రాజోలు కోర్టు సముదాయాల ప్రాంగణంలో ఏప్రిల్ 10న నిర్వహించే మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని మండల న్యాయసేవాధికార సంస్థ ఛైర్ పర్సన్, సీనియర్ సివిల్ జడ్జి పీ.జే సుధ సూచించారు. జిల్లా జడ్జి ఆదేశాల మేరకు శుక్రవారం న్యాయవాదులు, ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లతో ఆమె సమావేశం నిర్వహించారు. సివిల్ తగాదాలు, రాజీ పడే క్రిమినల్ కేసులు, బ్యాంకు ఫ్రీ లిటిగేషన్ తగాదాలు పరిష్కరిస్తామన్నారు. బాధితుల పరిహార పథకం, ప్రాథమిక హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని న్యాయవాదులకు ఆమె సూచించారు.
ఇదీ చదవండి: