తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం తహశీల్దార్ మహమ్మద్ యూసుఫ్ జిలానీ కరోనాతో మృతి చెందారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడిన జిలానీని అతని కుటుంబసభ్యులు రాజమహేంద్రవరంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని ఆస్పత్రిలో వైద్యం అందించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద జిలానీ చిత్రపటానికి తోటి ఉద్యోగులు పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. ఆయన మృతికి పలువురు నాయకులు, అధికారులు సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి.