తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, రాజానగరం నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో రేషన్ సరకులు పంపిణీ చేసేందుకు ఉపయోగించే సర్వర్ పని చేయడం లేదు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పంపిణీ చేస్తున్నందున లబ్దిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో సాంకేతిక సమస్యతో జాప్యం జరుగుతోంది. ఎండలో నిలబడలేక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. రాజానగరం నియోజకవర్గంలోని దివాన్ చెరువు గ్రామంలో యువత, గ్రామ వాలంటీర్స్ సంయుక్తంగా రేషన్ షాపుల వద్ద టెంట్లు వేసి ఎండ నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి.