తూర్పు గోదావరి జిల్లా గొల్లల మామిడాడలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, కోలాటాల నడుమ గ్రామపుర వీధుల్లో స్వామి, అమ్మవార్లను గ్రామస్థులు రథంపై ఊరేగించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు.
ఈ క్రమంలో సూర్యనారాయణ స్వామి వారి నామస్మరణతో.. ఊరంతా మార్మోగింది. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి.. సతీసమేతంగా స్వామివారి రథోత్సవాల్లో పాల్గొన్నారు. అలాగే స్వామి వారిని తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: