ETV Bharat / state

'మలేరియా, మాతా శిశు మరణాలు జరిగితే సహించేది లేదు'

రంపచోడవరం ఐటీడీఏ పీవో ఆదిత్య గురువారం వైద్య ఆరోగ్య, మలేరియా శాఖాధికారులతో సమీక్ష జరిపారు. మన్యంలో మలేరియా, మాతా శిశు మరణాలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.

rampa chodavaram itda po aditya meeting with malaria and medical department officers
రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్​ అధికారి ప్రవీణ్​ ఆదిత్య
author img

By

Published : Oct 22, 2020, 4:52 PM IST

మన్యంలో మలేరియా, మాతా శిశు మరణాలు సంభవిస్తే సహించేది లేదని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్​ అధికారి ప్రవీణ్​ ఆదిత్య హెచ్చరించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ, మలేరియా శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. మలేరియా అధికంగా ఉన్న గ్రామాలను గుర్తించి ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులకు తెలియజేశారు. అలాగే పోషకాహార లేమితో మాతా శిశు మరణాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రమాదకరంగా ఉన్న గర్భిణీలను ముందుగానే గుర్తించి సమీప ఆసుపత్రిలో చేర్పించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి :

మలేరియా బాధితురాలు మృతి.. కుటుంబీకుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.