శ్రీరామ నవమి ఉత్సవాలకు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ముస్తాబైంది. ఈనెల 12 నుంచి వేడుకలు జరగనున్నాయి. సత్యనారాయణ స్వామి క్షేత్ర పాలకులుగా కొలిచే సీతారాముల కల్యాణ మహోత్సవాలు ఈ నెల 12 నుంచి 20 వరకు జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. 12న పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఉత్సవం, 13న కల్యాణం, 15న సదస్యం, 18న వన విహారం, 19న చక్రస్నానం, 20న శ్రీ పుష్పయాగం కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు.
ఇవీ చదవండి..