'మూడు రాజధానులు ముద్దు' అంటూ తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైకాపా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని నినాదాలు చేస్తూ.. ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ నేతృత్వంలో ర్యాలీ చేశారు. అనంతరం ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనివలన వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలో వలసలు తగ్గి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అమరావతి విషయంలో చంద్రబాబు తన వారికి లబ్ధి చేకూర్చడానికి చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అంటించారు. వైకాపా నేత కర్రి పాపారాయుడు గుండు చేయించుకుని చంద్రబాబు వైఖరిపై నిరసన తెలిపారు.
ఇవీ చదవండి..