తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు ఆరో తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠశాలలో చేరే విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, షూ అందించారు. పాఠశాలలో చేరే ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి 15 వేల రూపాయల కానుక అందిస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో సర్కారీ బడులలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతి మండలంలోనూ మండల విద్యాశాఖ అధికారితోపాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఇదీచదవండి