గ్రామస్థాయిలోనే రైతులకు అన్ని రకాల సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండలంలో 21, ఐ.పోలవరం మండలంలో 19, ముమ్మిడివరం మండలంలో 15, కాట్రేనికోన మండలంలో 17 రైతుభరోసా కేంద్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
ఈ కేంద్రాల ద్వారా చిన్న, సన్నకారు రైతుల వివరాలు నమోదు చేసి భూమి విస్తీర్ణం, భూసార పరీక్షలు, కాలాన్ని బట్టి ఎలాంటి పంటలు వేయాలనేది రైతులకు వివరించనున్నారు. పండిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునే విధానాలు చూపించనున్నారు. ఆధునిక పద్ధతిలో సేద్యం, ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం వంటి వివరాలు... చిత్రాలతో కూడిన పుస్తకాలు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటాయి. రైతుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ముందుగా తెలియజేస్తే... నేరుగా వారికి అందేలా ఈ కేంద్రం సహాయపడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు.
ఇదీ చదవండి :