ETV Bharat / state

జీజీహెచ్​లో అడుగడుగునా నీరు.. రోగులు బేజారు - తూర్పోగోదావరి జిల్లా వార్తలు

జీజీహెచ్ ఆసుపత్రిలోని పలు విభాగాల్లో వర్షపు నీరు చేరి వైద్య సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీటిలోనే రోగులు వైద్యం చేయించుకున్న పరిస్థితి తలెత్తింది. మందు భద్రపరిచే గదుల్లోకి వర్షం నీరు చేరడంతో జౌషధాలు తడిశాయి.

kakinada ggh news
kakinada ggh news
author img

By

Published : Sep 7, 2021, 10:16 AM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్‌)లోని పలు విభాగాల్లో సోమవారం వర్షపు నీరు చేరడంతో రోగులు, వైద్య సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. పలు వార్డులతో పాటు ఓపీ భవనంలోకి ముంపు నీరు ప్రవేశించింది.. గచ్చుపై వర్షపునీరు ఉండగానే రోగులు నిరీక్షించి వైద్యం చేయించుకున్నారు. మందులు భద్రపరిచే గది వద్ద వర్షం నీరు చేరడంతో ఔషధాలు తడిశాయి. ఎముకల విభాగం ఓపీ వద్ద కట్లుకట్లే గదిలోకి నీరు చేరింది. వరండాలో మోటార్‌ పెట్టి బయటకు తోడారు. మెడికల్‌ విభాగంలోని పలు వార్డుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రిలోని గైనిక్‌, పిడియాట్రిక్‌ వార్డుల్లోకి నీరు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిటికీలకు తలుపులు లేకపోవడంతో వాటిలోంచి జల్లు లోపలికి కురిసింది. చేసేది లేక ఒక్కో మంచాన్ని ముగ్గురు గర్భిణులకు కేటాయించారు. మైక్రోబయాలజీ, దిశ సెంటర్‌, మెడికల్‌ వార్డు, నర్సింగ్‌ స్కూల్‌ వద్ద కూడా అదే పరిస్థితి కనిపించింది.

ఇదీ చదవండి: High-count: ఏకపక్షంగా ఫీజుల ఖరారు.. హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.