తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నుంచి సముద్రంలోకి నీటిని విడిచి పెట్టడంతో... సముద్రంలో ఉండే పులస చేపలు గోదావరిలో ఎదురు ఈదుతూ వస్తుంటాయి. రావులపాలెంలోని గౌతమి వంతెన వద్ద జాతీయ రహదారిపై పులస విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జాతీయ రహదారి వెంబడి వెళ్లే ప్రయాణికులు ఇక్కడ ఆగి వీటిని కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. ఏడాదికి ఒకసారి మాత్రమే దొరికే పులస చేప కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడి ప్రాంతవాసులు. వీటిని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులకు వండి మరీ పంపిస్తుంటారు.
ఇదీ చూడండి. ధవళేశ్వరం వద్ద వరద తగ్గుముఖం