ETV Bharat / state

'సమస్య పరిష్కారం కాకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తా' - యానాం వలస కార్మికుల తాజా న్యూస్

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన విధానాలను కాదని... పుదుచ్చేరీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ కింది స్థాయి అధికారులకు ఇచ్చిన ఆదేశాలను ఆ రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావు వ్యతిరేకించారు. బోర్డర్​ చెక్​పోస్టుల వద్ద పడిగాపులు కాస్తున్న వలస కార్మికుల విషయమై కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఆయన ఫిర్యాదు చేశారు. 24 గంటల్లో సమస్య పరిష్కారం కాకుంటే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు.

వలస కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరిన పుదుచ్చేరీ రాష్ట్రమంత్రి

author img

By

Published : Apr 28, 2020, 6:32 PM IST

వలసదారుల సమస్యలు పరిష్కరించాలని పుదుచ్చేరి మంత్రి వినతి

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన విధానాలను కాదని... పుదుచ్చేరీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ కింది స్థాయి అధికారులకు ఇచ్చిన ఆదేశాలను ఆ రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావు వ్యతిరేకించారు. లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లిన ఏడుగురు యువకులు ఎన్నో ఇబ్బందులు పడి రెండు రోజుల క్రితం యానాం చేరుకున్నారు. వీరిని బోర్డర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిలువరించి వివరాలు తెలుసుకుని తిరిగి వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఏ ప్రాంతంలో చిక్కుకున్నవారైనా సొంత ఊళ్లకు చేరుకుంటే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి 28 రోజుల పాటు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని పుదుచ్చేరీ ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆదేశించారు. దానికి విరుద్ధంగా లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ ఎవరినీ రానివ్వొద్దని అధికారులను ఆదేశించారు. ఫలితంగా బోర్డర్‌లోనే ఆగిపోయిన వారితో పాటు వారి కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఫిర్యాదు చేశారు. 24 గంటల్లో సమస్య పరిష్కారం కాకుంటే తన మంత్రిపదవికి రాజీనామా చేస్తానని మంత్రి ప్రకటించారు.

ఇదీ చూడండి:

యానాంలో ప్రవేశించే మార్గాలు మూసివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.