సివిల్ సర్వీసెస్.. రైల్వే.. బ్యాంకింగ్.. ఇలా ఏ రంగంలోనైనా కొలువులు సాధించేందుకు నిరుద్యోగులు తీవ్రంగా కష్టపడుతుంటారు. ఎన్నో శిక్షణా కేంద్రాలను ఆశ్రయిస్తుంటారు. వీరి కోసం తూర్పు గోదావరిలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం.. యానంలో సుమారు రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక విజ్ఞాన భాండాగారం అంబేద్కర్ విజ్ఞాన భవన్ ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది జనవరి 6న పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి దీనిని ప్రారంభించనున్నారు. దీన్ని కేంద్ర కళలు సంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా నిధులు సమకూర్చి నిర్మించామని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. భవనం ముందు మూర్తిభవించిన అంబేద్కర్ కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భారత రాజ్యాంగాన్ని రెండు చేతులతో పట్టుకున్నట్లు.. విజయవాడకు చెందిన ప్రముఖ శిల్పి బీఎస్వీ ప్రసాద్ దీన్ని తీర్చిదిద్దారు. భవనం లోపల అరుదైన పుస్తకాలను ఉంచేందుకు, గ్రంథ పఠనం చేసేందుకు, ఆన్ లైన్లో ప్రముఖుల సూచనలు, సలహాలను వినేందుకు డిజిటల్ గదులను సిద్ధం చేశారు. దీని నిర్వహణ బాధ్యతలను ప్రముఖ చమురు సంస్థ 20 ఏళ్ల పాటు చేపట్టనుంది.
జనవరి 6న అంబేద్కర్ విజ్ఞాన భవన్‌ను ప్రారభించనున్న పుదుచ్చేరి సీఎం - యానం వార్తలు
నిరుద్యోగులకు శిక్షణను ఇచ్చేందుకు సుమారు రూ. 5 కోట్లతో.. కేంద్రపాలిత ప్రాంతం యానంలో నిర్మించిన అంబేద్కర్ విజ్ఞాన భవన్‌ను వచ్చే ఏడాది జనవరి 6న పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ప్రారంభించనున్నారు. భవనం ముందు ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీని నిర్వహణ బాధ్యతలను ప్రముఖ చమురు సంస్థ 20 ఏళ్ల పాటు చేపట్టనుంది.