ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా తూర్పు గోదావరి జిల్లాలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ మేరకు జేఏసీ జిల్లా కన్వీనర్ తాటిపాక మధు తెలిపారు.
నిరసనగా..
రాష్ట్ర ప్రభుత్వం రాజ్యంగ హక్కులను నాశనం చేస్తున్నందుకు నిరసనగా ఆదివారం ఉదయం అంబేడ్కర్ విగ్రహాల వద్ద ఆందోళన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
మండల, సబ్ డివిజన్ కేంద్రాలు..
ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, సబ్ డివిజన్ కేంద్రాలు, జిల్లా కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : శ్రీసిటీ.. ఇచ్చట అంతర్జాతీయ స్థాయి దుస్తులు తయారవును..!