కరోనా కారణంగా నష్టపోయిన కార్మికులకు న్యాయం చేయాలని.. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. జిల్లాలో కొబ్బరి ఎక్కువగా సాగవుతున్నందున... కొబ్బరి ఆధారిత పరిశ్రమలను నెలకొల్పాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా పనులు లేక కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పరిశ్రమలు నెలకొల్పితే.. నిరుద్యోగం తగ్గుతుందని విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి.