తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెదేపా నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేస్తూ తెదేపా కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డులోని గాంధీ బొమ్మవరకు ర్యాలీగా నడిచివెళ్లి నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: