తాళ్లరేవు మండలం కోరింగలోని ఓ ప్రైవేట్ ఫార్మసీ కళాశాల డైరెక్టర్‌లలో ఒకరైన గుండు శ్రీనివాసరావు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ విద్యార్థిని ఆరోపించింది. వసతి గృహం నుంచి కళాశాలకు వెళ్లే సమయంలో గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత విద్యార్థిని తెలిపింది. మిగతా విద్యార్థినులతోనూ ఇలాగే వ్యవహరిస్తున్నాడని, అతడి ప్రవర్తనకు భయపడి అనేక మంది కళాశాల వదిలి వెళ్లిపోయారని వాపోయింది. ఈ ఘటనపై గత సోమవారం 'స్పందన' కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. వారం రోజులైనా చర్యలు చేపట్టక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాసంఘాలు ఇవాళ మరోసారి ఫిర్యాదు చేశాయి. రేపు సాయంత్రానికి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినట్లు బాధితురాలు తెలిపింది.
కళాశాల డైరెక్టర్ వేధింపులపై 'స్పందన'లో ఫిర్యాదు - STUDENT COMPLAINT IN KAKINADA COLLECTOR
తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరింగలోని ఓ ప్రైవేట్ ఫార్మసీ కళాశాల విద్యార్థినిపై లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. కళాశాల డైరెక్టర్‌లలో ఒకరైన గుండు శ్రీనివాసరావు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ విద్యార్థిని ఆరోపించింది. ఈ విషయంపై కాకినాడ కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది.
![కళాశాల డైరెక్టర్ వేధింపులపై 'స్పందన'లో ఫిర్యాదు SEXUAL HARRASEMENT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6107493-242-6107493-1581956092598.jpg?imwidth=3840)
తాళ్లరేవు మండలం కోరింగలోని ఓ ప్రైవేట్ ఫార్మసీ కళాశాల డైరెక్టర్‌లలో ఒకరైన గుండు శ్రీనివాసరావు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ విద్యార్థిని ఆరోపించింది. వసతి గృహం నుంచి కళాశాలకు వెళ్లే సమయంలో గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత విద్యార్థిని తెలిపింది. మిగతా విద్యార్థినులతోనూ ఇలాగే వ్యవహరిస్తున్నాడని, అతడి ప్రవర్తనకు భయపడి అనేక మంది కళాశాల వదిలి వెళ్లిపోయారని వాపోయింది. ఈ ఘటనపై గత సోమవారం 'స్పందన' కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. వారం రోజులైనా చర్యలు చేపట్టక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాసంఘాలు ఇవాళ మరోసారి ఫిర్యాదు చేశాయి. రేపు సాయంత్రానికి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినట్లు బాధితురాలు తెలిపింది.
ఇవీ చూడండి-ఈ వీడియో చూస్తే రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉంటారు!