ETV Bharat / state

స్వచ్ఛ పల్లెకు సన్నద్ధం.. 'మనం-మన పరిశుభ్రత' ప్రారంభం

author img

By

Published : May 31, 2020, 4:40 PM IST

వ్యక్తిగత శుభ్రతతో పాటు పల్లెలు.. పరిసరాలు శుభ్రంగా ఉంటే ప్రజారోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఈ క్రమంలోనే పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న '‘మనం- మన పరిశుభ్రత’' కార్యక్రమాన్ని జూన్‌ 1 నుంచి తూర్పుగోదావరి జిల్లాలో అమలు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది.

preparations for clean village program in east godavari district
స్వచ్ఛ పల్లెకు సన్నద్ధం.. 'మనం-మన పరిశుభ్రత' ప్రారంభం

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం మనం- మన పరిశుభ్రత పేరుతో కార్యక్రమం ప్రారంభించనుంది. దీనికి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 62 మండలాల్లో ఒక్కోచోట రెండేసి చొప్పున పంచాయతీలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మొత్తం 124 పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాస్థాయి ప్రారంభ కార్యక్రమాన్ని సోమవారం సామర్లకోట మండలం పనసపాడు పంచాయతీలో నిర్వహించాలని నిర్ణయించారు.

ప్రజల భాగస్వామ్యంతో

జిల్లాలో నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాలను పారిశుద్ధ్య సమస్యలు వేధిస్తున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి జిల్లాలో విజృంభిస్తున్నందున అన్ని చోట్లా పారిశుద్ధ్యంపై దృష్టిసారించారు. ఘన వ్యర్థాల నిర్వహణ సమర్థంగా సాగకపోవడం.. వ్యర్థ జలాల శుద్ధి ప్రక్రియకూ వనరులు లేకపోవడం సమస్యగా మారింది. కలుషిత జలాలతో పాటు టన్నుల కొద్దీ వ్యర్థాలు.. సముద్రం, నదులు, ప్రధాన కాలువల్లో కలిసిపోతుండడం వలన పర్యావరణ సమస్యలు తెరపైకి వస్తున్నాయి. గత వైఫల్యాలను అధిగమించే క్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

ఒక్కో ఇంటి నుంచి రూ. 2 వసూలు

500 నివాసాల నుంచి 1000లోపు నివాసాలున్న పంచాయతీలను తొలి దశలో ఎంపిక చేశారు. ప్రతి ఇంటి నుంచి రోజుకు రూ.2 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ పంచాయతీలో ఎంపిక చేసిన గ్రామ పెద్ద పేర్లతో బ్యాంకులో ఉమ్మడి ఖాతాను ప్రారంభించి వాలంటీర్లు వసూలు చేసిన మొత్తాన్ని ఆ ఖాతాలో జమ చేస్తారు. ఈ జీతంలో ఒక గ్రీన్‌ అంబాసిడర్‌కు రూ.6 వేల చొప్పున ఇద్దరికి రూ.12 వేలు.. గ్రీన్‌ గార్డుకు జీతం రూ.6 వేలు కలిపి నెలకు రూ.18 వేలు ఈ ఉమ్మడి ఖాతా నుంచి చెల్లిస్తారు. జీతాలు పోను మిగిలిన సొమ్ముతో గ్రీన్‌ అంబాసిడర్లు, గ్రీన్‌ గార్డులకు వ్యక్తిగత రక్షణ పరికరాలు, చెత్తను తరలించే వాహనాలు సమకూర్చడం, వాటి నిర్వహణ, పారిశుద్ధ్య సామగ్రి కొనుగోలు తదితర ఖర్చులకు వినియోగిస్తారు. ప్రస్తుతం స్వచ్ఛంద కార్పొరేషన్‌ నుంచి వీరికి వేతనాలు చెల్లిస్తున్నారు. ఈ నిధులు విడుదల నిలిపివేసిన తర్వాత గృహాల నుంచి వసూలు చేసిన సొమ్ముతో వీటిని చెల్లించేలా చర్యలు తీసుకుంటారు.

పరిస్థితి ఇదీ..

పారిశుద్ధ్య పరిరక్షణలో కీలకమైన ఘన వ్యర్థాల నిర్వహణలో గత ప్రయోగాలు నిరాశపరిచాయి. మూడున్నరేళ్ల కిందట తడి- పొడి చెత్తను వేరుచేసి వాటి ద్వారా సంపద సృష్టించే క్రమంలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. కొన్ని నిర్మాణ దశలోనే ఉండగా.. మరికొన్ని నిర్మాణాలు పూర్తయినా నిరుపయోగంగా మారాయి. జిల్లాలో 810 ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు మంజూరు కాగా ఇప్పటికి 610 పూర్తయ్యాయి. సామర్థ్యాన్ని బట్టి ఒక్కో కేంద్రం నిర్మాణానికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అప్పట్లో వెచ్చించారు. తాజాగా ‘మనం- మన పరిశుభ్రత’ కార్యక్రమం ద్వారా విడతల వారీగా వీటిని వినియోగంలోకి తేవాలని భావిస్తున్నారు.

ఇవీ చదవండి... విజయవాడలో విద్యార్థుల గ్యాంగ్​ వార్​.. పలువురికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.