తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రాకార సేవను వేడుకగా నిర్వహించారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి తిరుచ్చిపై ప్రధానాలయం ప్రాకారం చుట్టు మూడు సార్లు ఊరేగించారు. ఈ సేవలను ఆలయ చైర్మన్ ఐ.వి రోహిత్, ఈవో త్రినాథరావులు టెంకాయ కొట్టి ప్రారంభించారు. ప్రతి ఏటా కార్తిక పౌర్ణమి రోజున జరిగే గిరి ప్రదక్షిణ కరోనా కారణంగా ఈ ఏడాది రద్దు చేశారు.
ఇవీ చూడండి...