ETV Bharat / state

Prabhalu: కోనసీమలో వైభవంగా ప్రభల తీర్థం

Prabhala Theertham: తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ప్రభల తీర్థ మహోత్సవం ఘనంగా సాగుతోంది. అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థ వేడుకలు చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. వాకలగరువు, తొండపూడి, గున్నేపల్లి అగ్రహారం, చిరుతపూడిలో ప్రభల మహోత్సవం కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. 420 ఏళ్లుగా ప్రభల మహోత్సవం కొనసాగుతుందని స్థానికులు తెలుపుతున్నారు. జగ్గన్నతోట ప్రభలతీర్థ విశేషాలను 'ఈటీవీ భారత్' ప్రతినిధి అందిస్తారు.

కోనసీమలో వైభవంగా ప్రభల తీర్థం
కోనసీమలో వైభవంగా ప్రభల తీర్థం
author img

By

Published : Jan 16, 2022, 6:24 PM IST

Updated : Jan 17, 2022, 9:30 AM IST

కోనసీమలో వైభవంగా ప్రభల తీర్థం

Prabhala Theertham Glory at Konaseema: సంక్రాంతి పర్వదినాల్లో కోనసీమలో నిర్వహించే అతిపెద్ద వేడుక ప్రభలతీర్థం. అంబాజీపేట, అయినవిల్లి, పి.గన్నవరం, అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం ముమ్మిడివరం, ఐ.పోలవరం, రాజోలు, మామిడికుదురు సహా పలు మండలాల్లో... ఏటా కనుమ పండుగ రోజున ప్రభుల తీర్థం ఘనంగా నిర్వహించడం ఆనవాయితి. అంబాజీపేట మండలం జగ్గన్నతోట ప్రభల తీర్థం 420 ఏళ్లకుపైగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కనుమ రోజున ఏకాదశ రుద్రులు కొలువుతీరేది. దేశం మొత్తం మీద జగ్గన్నతోటలోనే అనేది భక్తుల విశ్వాసం.

మేళ తాళాలతో ఊరేగిస్తూ..

తాటి చెట్టు బద్దలు, మర్రివృక్షంతో చేసిన చక్కబల్లను నూలుతో గట్టిగా కట్టి వాటిపై ఉత్సవ మూర్తుల్ని ప్రతిష్ఠింపచేస్తారు. నెమలిపించాలు, నూతన వస్త్రాలతో చూడముచ్చటగా అలంకరింస్తారు. టన్నుల కొద్దీ బరువు ఉండే ప్రభల్ని 150 నుంచి 200 వందలమంది యువకులు మోస్తూ.. మేళ తాళాలతో ఊరేగిస్తూ 11 గ్రామాల నుంచి జగ్గన్నతోటకు తీసుకొచ్చారు. గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం నుంచి వరి పొలాల మీదుగా కౌశిక నది దాటి తీర్థ స్థలికి ప్రభలను తీసుకెళ్లారు. ఈ ఆద్యాత్మిక శోభను తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

పార్వతీ వీరేశ్వరస్వామి, చెన్నమల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరస్వామి, మేనకేశ్వరస్వామి, ఆనందమేశ్వరస్వామి... ఇలా ఈశ్వరుడి నామాలుతో ప్రభలు ముందుకు సాగాయి. అంబాజీపేట మండలం వాకలగరువు, తొండపూడిలో రాష్ట్రంలోనే ఎత్తైన 45 అడుగుల ప్రభలు ఏర్పాటు చేశారు. కోనసీమలోని మిగతా మండలాల్లోనూ ప్రభలతీర్థ మహోత్సవం వైభవంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు.. ఉత్సవాల్ని తిలకించారు. సాయంత్రం మంగళ వాయిద్యాల మధ్య తిరిగి ఆయా గ్రామాలకు ప్రభలను చేర్చారు.

ఇదీ చదవండి

కోడిపందేల బరి వద్ద ఇరువర్గాల ఘర్షణ, యువకుడు మృతి

Last Updated : Jan 17, 2022, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.