తెలుగు వారి వైభవంగా జరుపుకునే మూడు రోజుల పండుగలో ప్రాచుర్యం ఉన్న ప్రభల తీర్థాలు... తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. 175 గ్రామాలకు చెందిన 500 ప్రభలు.. వివిధ ప్రాంతాల్లో నిర్వహించే తీర్థ ప్రదేశాలకు తరలి వెళుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రభల ఉత్సవం.. కన్నుల పండువగా సాగనున్నాయి. వీరభద్రుని ప్రార్థిస్తూ శరభ శరభ అంటూ.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రభలను ఊరేగిస్తున్న తీరు ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చదవండి: పొట్టి ఆవుల నిలయం... ప్రపంచంలోనే ప్రత్యేకం!