కొవిడ్ విధులు నిర్వహించే వారికి అవసరమైన పీపీఈ కిట్లు, ఇతర రక్షణ పరికరాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని... తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపల్ ఛైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి విజ్ఞప్తి చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమకూర్చిన పీపీఈ కిట్లను అంబులెన్స్ డ్రైవర్లకు ఆమె అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విశాఖ కేజీహెచ్‌కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు విరాళం