ETV Bharat / state

ఆహార ప్యాకెట్ల కోసం పరుగులు పెడుతున్న నిరుపేదలు - రాజమహేంద్రవరంలో ఆకలి భాదలు

లాక్‌డౌన్‌ వల్ల అన్నార్తులు ఆకలితో అలమటిస్తున్నారు. ఆహారం దొరక్క నిరుపేదలు అల్లాడుతున్నారు. సాయం కోసం రోడ్లపై నిరీక్షిస్తున్నారు. దాతలు ఇచ్చే ఆహార ప్యాకెట్ల కోసం పరుగులు పెడుతున్నారు.

poor-people-
poor-people-
author img

By

Published : Apr 18, 2020, 2:40 AM IST

ఆహార ప్యాకెట్ల కోసం పరుగులు పెడుతున్న నిరుపేదలు

లాక్ డౌన్ ప్రభావంతో సకలజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. పనులు ఆగిపోవటంతో ఉపాధి లభించని పరిస్థితి ఏర్పడింది. రోజూవారి కూలీలు, నిరాశ్రయులు, యాచకుల పరిస్థితి మరీదయనీయంగా మారింది. సమయానికి ఆహారం దొరక్కా అల్లాడిపోతున్నారు. ఎవరైనా చేయూతనిస్తారని గుప్పెడు మెతుకుల కోసం..రోడ్లపై నిరీక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం,కాకినాడలో.. దాతలు ఇచ్చే అన్నదాన ప్యాకెట్ల కోసం అన్నార్తులు పరుగులు తీస్తున్న ఈ దృశ్యాలు ఆవేదనను మిగులుస్తున్నాయి. నగరంలో నిత్యం యువకులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు వివిధ రకాలుగా భోజన ప్యాకెట్లు అందిస్తూనే ఉన్నారు. దాతలు ఇచ్చిన ఆహారాన్ని అన్నార్తులు కళ్లకద్దుకుని తీసుకుంటున్నారు. ఉన్నదాంట్లోనే జంతువులకు కూడా పెడుతూ మానవీయతను చాటుతున్నారు.

ఇవీ చదవండి: 'లాక్​డౌన్​తో సగానికి తగ్గిన కరోనా వ్యాప్తి రేటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.