తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి శివారులో వేర్వేరు ఘటనల్లో 185 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీని విలువ రూ. పది లక్షలు ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి ఏఎస్పీ బిందు మాధవ్ మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. గంజాయి రవాణాపై తమకు అందిన సమాచారం మేరకు అప్రమత్తమైనట్లు చెప్పారు. విశాఖ జిల్లా దారకొండ నుంచి మారేడుమిల్లి మీదుగా తెలంగాణకు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని వెల్లడించారు. ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్కు పంపిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: మడకశిరలో కర్ణాటక మద్యం పట్టివేత