ETV Bharat / state

ఉద్రిక్తతకు దారి తీసిన 'స్థలాల సేకరణ'!

తూర్పుగోదావరి జిల్లా ఇటికాయలపల్లిలో స్థలాల సేకరణ ప్రక్రియను.. స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులుతో వాగ్వాదంలో కొందరు గాయపడ్డారు.

Police misconduct in collecting homes land in corona lockdown  at Itikayalapalli in east godavari

author img

By

Published : May 6, 2020, 6:16 PM IST

ఉద్రిక్తతకు దారి తీసిన 'స్థలాల సేకరణ'

ఇళ్ల స్థలాల పంపిణీకి చేస్తున్న స్థల సేకరణ ప్రక్రియ... తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం ఇటికాయలపల్లిలో ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామంలో సుమారు 60 సెంట్ల భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయంచాలని అధికారులు భావించారు. ఆ స్థలాన్ని అనుకుని ఉన్న గ్రామకంఠం భూముల్లో కొందరు పాకలు, గడ్డిమేట్లు వేసుకున్నారు. వాటిని ఖాళీ చేయాలని అక్కడివారిని ఆదేశించారు. తమ పూర్వీకుల నుంచి అక్కడే ఉంటున్నామని... ఆ స్థలాలు క్రయ విక్రయాలు జరిగాయని, తమ వద్ద పత్రాలు ఉన్నాయన్నాని గ్రామస్తులు చెప్పారు. అవేమీ చెల్లవంటూ రెవెన్యూ, పంచాయతీ అధికారులు పోలీసుల సహాయంతో అక్కడకు చేరుకున్నారు.

ప్రొక్లెయినర్​తో వాటిని... ఖాళీ చేయిస్తుండగా స్థానికులు అడ్డుపడ్డారు. ఈ మేరకు పోలీసులకు స్థానికులకు మధ్య ఘర్షణ జరిగింది. ఒక బాలిక కాలుకు తీవ్ర గాయాలు కాగా.. చాలామంది గాయపడ్డారు. బాలికను వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

సీసీ కెమెరాల నిఘా మధ్య తుని

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.