ETV Bharat / state

నడుస్తూ ఇంటికి వెళ్తున్న బాలింతకు... పోలీసుల సాయం

author img

By

Published : Apr 19, 2020, 7:56 PM IST

లాక్ డౌన్ సమయాన పోలీసులు కాస్త కఠినంగానే వ్యవరిస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారిని నిలువరించడం.. వారి వాహనాలకు రంగులు వేయడం.. అప్పుడప్పుడు లాఠీలకు పనిచెప్పడం వంటి పనులు చేస్తున్నారు. ఇదే సమయంలో.. ఇలా మానవత్వాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు.

police helps to delivery women at tuni
బాలింతరాలికి పోలీసుల సాయం

అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకుని ఆసుపత్రి నుంచి నడిచి వెళ్తున్న బాలింతకు పోలీసులు అండగా నిలిచారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో ఓ మహిళ ఆసుపత్రిలో ప్రసవించింది. అనంతరం లాక్ డౌన్ కారణంగా వాహనాలు లేక నడిచి ఇంటికి వెళుతుండగా పోలీసులు గమనించారు. ఆమెకు సాయం చేశారు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సీఐ రమేశ్ బాబు తన జీపును సిబ్బందికి ఇచ్చి ఆమెను ఇంటివద్ద దింపేలా చేశారు. వారి సహాయానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

ఇవీ చదవండి:

'కాళ్లు మొక్కుతాం.. అడుగు బయట పెట్టొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.