తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం జి.వేమవరం గ్రామంలో ఈనెల 28న 18 నెలల చిన్నారిపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న 42 ఏళ్ల వీర వెంకటరావు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కాకినాడ దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ మురళీ మోహన్ తెలిపారు.
చిన్నారిని సమీపంలోని కొబ్బరి తోటలో తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు తల్లి ఫిర్యాదు చేయడంతో ఐ.పోలవరం ఎస్సై రాము కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం నిందితుడి కోసం గాలింపు చేపట్టి ఎదుర్లంక గ్రామ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుడిని అమలాపురం కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పకోడి బండి వివాదంలో.. హత్యకు గురైన బాలుడి అంత్యక్రియలు పూర్తి