పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు రెండు నెలల్లో పూర్తిస్థాయిలో ప్యాకేజీలు చెల్లిస్తామని పునరావాస ప్రత్యేక అధికారి ఆనంద్ తెలిపారు. దేవీపట్నం మండలంలో ముంపు బాధితులకు నిర్మించిన కాలనీలను ఆయన సందర్శించారు. అనంతరం తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో మాట్లాడారు. దేవీపట్నం మండలంలోని ఎనిమిది గ్రామాల నిర్వాసితులకు ప్రభుత్వం రూ.80 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందన్నారు.
అర్హులైన నిర్వాసితులకు ప్యాకేజీలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులకు అన్యాయం జరిగితే నేరుగా తమను సంప్రదించవచ్చని చెప్పారు. అటువంటి వారికోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెబ్ సైట్ను ఏర్పాటు చేసిందనట్లు చెప్పారు. ఆ దరఖాస్తులను తహసీల్దార్ పరిశీలిస్తారని.. ఉన్నతాధికారులకు నివేదించిన తర్వాత పరిహారం అందజేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:
విశాఖలోని ఉడా పార్కుకు కొత్త రూపు.. త్వరలోనే సందర్శకులకు అనుమతి