తూర్పుగోదావరి జిల్లా చోడవరంలో ఆదివారం రాత్రి గల్లంతైన శోభన్‌బాబు కోసం అధికారులు సరిగ్గా గాలింపు చర్యలు చేపట్టడం లేదని కుటుంబసభ్యులు ఆరోపించారు. నిన్న రాత్రి చోడవరం-నెల్లిపాక మధ్య జాతీయరహదారి కల్వర్టు పైనుంచి అతను గోదావరిలో జారిపడ్డాడు. ఆ సమయంలో నది ఉద్ధృతి అధికంగా ఉందనీ.. దీంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు. 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకూ అతని ఆచూకీ దొరకలేదనీ.. అధికారులు పూర్తిస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టడం లేదని శోభన్‌బాబు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అలాంటిదేమీ లేదని ఏపీఎస్ఆర్డీఎఫ్ బృందాలతో గాలిస్తున్నామనీ.. ప్రత్యేకంగా వలలూ ఏర్పాటు చేశామని అధికారులు వివరణ ఇచ్చారు.
ఇవీ చదవండి..