తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లికి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. అప్పటినుంచి హోం ఐసోలేషన్లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఊపిరి అందక బాధపడటంతో స్థానికులు 108కు ఫోన్ చేశారు. వారు వచ్చేసరికే అతను మృతిచెందాడు. అతని భార్యకూ వైరస్ సోకటంతో ఆమె బోడనకుర్రు క్వారంటైన్లో ఉంటోంది. ఆ వ్యక్తికి అంత్యక్రియలు చేసేందుకూ ఎవరూ ముందుకు రాకపోవటంతో అతని మృతదేహం ఇంటి ముందే ఉంది.
ఇవీ చదవండి..
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. వార్డులోనే కరోనా బాధితురాలి మృతదేహం