CM JAGAN RAJAMUNDRY MEETING : రాజమహేంద్రవరంలో సీఎం జగన్ సభకు మద్దతు కరవైంది. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే చాలా మంది ప్రజలు మధ్యలోనే వెళ్లిపోయారు. సభా ప్రాంగణం వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేవని.. నిల్చునే ఎలా ఉండాలని మండిపడ్డారు. తాగునీరు కూడా లేకపోతే ఎలా అంటూ పెదవివిరిచారు. ముఖ్యమంత్రి సభ కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించినప్పటికీ.. ప్రజలు సభ ప్రాంగణం వద్ద లేకపోవటంతో లాభం లేకపోయింది.
ఇవీ చదవండి: