కరోనా భయాందోళనలకు గురిచేస్తున్నా చాలా మందిలో మార్పు రావడం లేదు. తూర్పు గోదావరి జిల్లా తునిలోని ఎస్బీఐ వద్ద లావాదేవీల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. తుని పట్టణంలోని ప్రధాన రహదారిని కంటైన్మెంట్ జోన్ నుంచి తొలగించి సడలింపులు ఇవ్వగా.. బ్యాంకులు, వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి.
28 రోజుల తర్వాత బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చేసరికి.. పెద్ద సంఖ్యలో ఖాతా దారులు బారులు తీరారు. భౌతిక దూరాన్ని మరిచారు. ఖాతాదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా.. ఆయా బ్యాంకుల వద్ద అధికారులు కనీస ఏర్పాట్లు చేయలేదు.
ఇదీ చూడండి: