తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం యానాది కాలనీలో జనావాసాల మధ్య క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయడంపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం లేచి చూసే సరికి బీసీహాస్టల్లో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటై ఉందని.. దీనిపై అంతా ఆందోళనకు గురయ్యారని గ్రామ మాజీ ఉపసర్పంచ్ అడబాల వెంకటేశ్వరరావు అన్నారు. క్వారంటైన్లో ఉన్నవారు బయట తిరుగుతున్నారని.. దీని వల్ల ఇక్కడి వారు భయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో కాలనీవాసులు బీసీ హాస్టల్ వద్ద ధర్నాకు దిగారు. క్వారంటైన్ కేంద్రాన్ని వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి..