తూర్పుగోదావరి జిల్లాలో రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులోకి రావటంతో ప్రజలు త్వరగా టీకా వేయించుకునేందుకు రాజమహేంద్రవరంలోని ఆనందనగర్ పాఠశాలకు పోటెత్తారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా క్యూలైన్లలో నిల్చున్నారు. 12 గంటలకల్లా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిస్తామని సిబ్బంది ప్రకటించటంతో కొందరు నిరాశగా వెనుదిరిగారు.
ఇదీ చదవండి