ETV Bharat / state

'మా చందాలతోనైనా రోడ్డుపై గోతులు పూడ్చండి' - రోడ్డు మరమ్మతు కోసం విరాళమిచ్చిన చీడిగ ప్రజలు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం చీడిగలో.. కాకినాడ - మామిడాడ రోడ్డుకు మరమ్మతుల కోసం సీపీఎం కార్యకర్తలు సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వంపై నమ్మకం లేదన్న ప్రజలు.. మా చందాలతోనైనా మీరు ఈ రోడ్డుకు మరమ్మతులు చేయండంటూ రూ. 6,020లను స్వచ్ఛందంగా విరాళమిచ్చారు.

cpm signature collection
విరాళమిస్తున్న వాహనదారుడు
author img

By

Published : Nov 29, 2020, 5:27 PM IST

cpm signature collection
సీపీఎం నేతలు

రోడ్డు బాగుచేయాలని సీపీఎం కార్యకర్తలు సంతకాల సేకరణ చేపట్టగా.. 'చందాలు ఇస్తాం మీరైనా గోతు పూడ్చి ప్రాణాలు కాపాడండి' అంటూ ప్రజలు ముందుకు వచ్చారు. ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ.. గంటన్నర వ్యవధిలోనే రూ.6,020లను వాహనదారులు స్వచ్ఛందంగా విరాళమిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ - మామిడాడ రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతూ.. కాకినాడ రూరల్ మండలం చీడిగలో ఆ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో జరిగిందీ ఘటన. ఆ నగదును ఆర్​అండ్​బీ అధికారులకు అందచేస్తామని సీపీఎం నేతలు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించని పక్షంలో తామే ఆ పని పూర్తిచేస్తామని వెల్లడించారు.

ప్రభుత్వం నవరత్నాలు పేరుచెప్పి ప్రజలను మభ్యపెడుతూ శిథిలావస్థలో ఉన్న రోడ్లను పట్టించుకోవడం లేదని.. చీడిగ సీపీఎం కార్యదర్శి జుత్తుగ శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నా.. కనీసం రోడ్లకు మరమ్మతులు నిర్వహించడం లేదన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ చందాలతోనైనా.. చీడిగ - కొవ్వాడ మార్గంలో చెరువులుగా మారిన గోతులను పూడ్చాలని కోరారు. సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలేని స్థానిక శాసన సభ్యులు కన్నబాబు.. మంత్రి హోదాలో ఉండి రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. కాలువల్లో పూడికలు తీయకపోవడంతో.. రోడ్లు, గ్రామాలు మునిగిపోతుండటంపై ఆయన దృష్టి పెట్టాలన్నారు.

ఇదీ చదవండి:

ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. మారమ్మకు ఇల్లు కట్టిస్తామని హామీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.