జనసేన ఆధ్వర్యంలో.. రాజమహేంద్రవరం ధవళేశ్వర వద్దనున్న రామపాదాల రేవు వద్ద మన నుడి - మన నది కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరై.. గోదావరికి హారతి ఇచ్చారు. కాసేపు పిల్లలతో ముచ్చటించారు. పెద్ద బాలశిక్ష పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం పూజారులు శాస్త్రోక్తంగా నిర్వహించిన గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పవన్ అన్నారు. ఇందులో నదుల సంరక్షణ అత్యంత ముఖ్యమైందని చెప్పారు. అలాగే మాతృ భాష పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలకు పెద్దబాలశిక్ష ఎంతగానో ఉపయోగపడుతుందని పవన్ చెప్పారు. మన నుడి కార్యక్రమంలో భాగంగా పవన్‌కల్యాణ్ ఆదివారం కవులతో సమావేశమవుతారు.
ఇదీ చదవండి: