ETV Bharat / state

గోటితో పోయేది గొడ్డలి వరకు తీసుకొచ్చారు: పవన్ - arrest

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్టుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. గోటితో పోయే విషయాన్ని గొడ్డలి వరకూ తీసుకొచ్చారని అన్నారు. పరిస్థితి అదుపుతప్పితే తానే స్వయంగా రాజోలు వస్తానని హెచ్చరించారు.

పవన్
author img

By

Published : Aug 13, 2019, 3:45 PM IST

జనసేన అధినేత పవన్ స్పందన

తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికిపురం(పోలీసుల అదుపులో జనసేన ఎమ్మెల్యే) ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రజల తరఫున పోలీస్ స్టేషన్​కు వెళ్లిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్​పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం సరికాదన్నారు. చిన్నపాటి కేసులో నిందితుడైన ఓ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నందున అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మాత్రమే పోలీసులకు ఎమ్మెల్యే చెప్పారని అన్నారు. ఆయనపై కేసులు పెట్టడం సరికాదన్నారు.

నెల్లూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే ఓ విలేకరిపై దాడికి పాల్పడి, కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తే.. ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. మలికిపురం ఘటనలో గోటితో పోయేది గొడ్డలి వరకూ తీసుకొచ్చారని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన శాంతి భద్రతల సమస్యగా మారకుండా అధికార యంత్రాంగం పరిష్కరించాలని కోరారు. జనసేన క్యాడర్, నాయకులు సహనంతో, సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితి అదుపు తప్పి, ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే తాను స్వయంగా రాజోలు వచ్చి అండగా నిలబడతానని స్పష్టం చేశారు.

Intro:AP_RJY_62_13_CHILDREN_STRUGLE_DUE TO WATER TANK_AVB_AP10022

Body:AP_RJY_62_13_CHILDREN_STRUGLE_DUE T WATER TANK_AVB_AP10022

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.