ETV Bharat / state

పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యయం రూ. 8.30కోట్లు - sec latest news

అనేక ఆటుపోట్ల మధ్య.. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పంచాయతీ ఎన్నికలు ఆదివారం ముగియడంతో తూర్పుగోదావరి జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా అదివారం నాటికి రూ.8.30కోట్లు ఖర్చు అయిందని.. ఇంకా పెరిగే అవకాశం ఉందని డీపీవో నాగేశ్వర్‌నాయక్‌ తెలిపారు.

sec expenditure on panchayat elections
పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యయం ఏకంగా రూ. 8.30కోట్లు
author img

By

Published : Feb 22, 2021, 5:08 PM IST

ఎన్నికల నిర్వహణ అంటే ఆషామాషీ కాదు.. అందులోనూ 1,072 గ్రామ పంచాయతీలున్న తూర్పుగోదావరి జిల్లాలో వీటి నిర్వహణ కత్తిమీద సామే. పంచాయతీ ఎన్నికలు ఏకంగా 24 రోజులపాటు జిల్లా యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేశాయి. గత నెల 29న ప్రారంభమైన ఈ ప్రక్రియ.. అనేక ఆటుపోట్ల మధ్య.. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆదివారం ముగియడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

జిల్లాలో నాలుగు విడతలు కలిపి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యయం ఏకంగా రూ.8.30కోట్లుగా తేలింది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, ఓటర్ల జాబితాలు, పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సామగ్రి తరలింపునకు వాహనాలు, సిబ్బంది విధులు, వారికి పారితోషికాలు, అధికారుల వాహనాలు, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నిర్వహణ, ఇంధనం ఇలా పెద్ద ఎత్తున వ్యయం చేయాల్సి వచ్చింది. బ్యాలెట్‌ పెట్టెలు మినహా మిగతా అన్నింటికీ ఖర్చు చేశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి జిల్లాకు రూ.16 కోట్ల నిధులు గ్రామ పంచాయతీ ఎన్నికల నిమిత్తం విడుదల చేశారు. దీంతో జిల్లాలోని 61 మండలాల ఎంపీడీవోలకు రూ.8 నుంచి రూ.10లక్షల వరకు ముందస్తుగా మంజూరు చేశారు. మండల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లు, స్టేషనరీ ఇలా అన్నింటికీ ఈ నిధులు వ్యయం చేసేలా చర్యలు చేపట్టారు. ఆదివారం నాటికి తేలిన లెక్కల ప్రకారం రూ.8.30 కోట్లు ఖర్చయ్యిందని డీపీవో నాగేశ్వర్‌నాయక్‌ తెలిపారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

sec expenditure on panchayat elections
ఎన్నికల నిర్వహణ వ్యయం ఏకంగా రూ. 8.30కోట్లు

ఇదీచూడండి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం : ఎస్​ఈసీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.