తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ-పెనికేరు మధ్య ఉన్న జామతోటలోని బావిలో నీటికుక్క పిల్ల పడిపోయింది. దాన్ని చూసిన స్థానిక రైతులు వింత జంతువుగా భావించి భయాందోళనకు గురయ్యారు. ఇటీవల కపిలేశ్వరపురం సమీపంలో లేగదూడలను గుర్తుతెలియని జంతువు చంపిన సంఘటన నేపథ్యంలో నీటికుక్కను వింత జంతువుగా భావించారు.
స్థానిక పశువర్ధక శాఖ సహాయ సంచాలకులు రామకృష్ణ అక్కడికి చేరుకుని దాన్ని నీటికుక్కగా నిర్ధారించారు. దానివల్ల పశువులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. దాంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. బావి నిండేలా చేసి అందులో నుంచి నీటికుక్క బయటకు వచ్చేలా చేశారు.
ఇదీ చదవండి: పురుషోత్తపట్నంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ సభ్యుల పర్యటన