రాష్ట్రంలో సగానికిపైగా ఉన్న బీసీలు, మహిళలను గుర్తించింది తెలుగుదేశం పార్టీ అని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ నూతన అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి అన్నారు. తనను అధ్యక్షురాలిగా నియమించడంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..
పార్టీ అధిష్ఠానం తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అనంతకుమారి స్పష్టం చేశారు. త్వరలోనే నియోజకవర్గ పరిధిలో నూతన కమిటీలను నియమిస్తామని పేర్కొన్నారు. నూతనంగా నియమితులైన రెడ్డి అనంతకుమారి.. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం భార్య. 2014లో కొత్తపేట మండలం బిళ్లకూర్రు గ్రామంలో ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019 వరకు కొత్తపేట మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారు.
'బాలు కల నెరవేర్చాలి'.... సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ