ETV Bharat / state

జాగ్రత్త: కంటికి కనిపించకుండా కొల్లగొడుతున్నారు - తూర్పుగోదావరి జిల్లాలో ఆన్​లైన్ మోసం

వారు కంటికి కనిపించరు. మాటలు కలిపి.. వివరాలు తెలుసుకుంటారు. ఖాతాలోకి ప్రవేశించి క్షణాల్లో దోచేస్తారు. సాంకేతిక పరిజ్ఞానం పెట్టుబడిగా ఇటీవల కొందరు ఆన్‌లైన్‌ మోసాలతో పేట్రేగిపోతున్నారు. ఈ తరహా మోసాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

online cheating
online cheating
author img

By

Published : Apr 5, 2021, 10:37 AM IST

రాజమహేంద్రవరానికి చెందిన ఎం.శ్రీనివాసరావు తన ఏటీఎం కార్డు విరిగిపోవడంతో కొత్త దానికోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌చేసి.. కార్డు మంజూరుకు ఖాతా వివరాలు కావాలని అడిగాడు. వివరాలిచ్చిన తరువాత ఖాతాలోంచి రూ.50 వేలు కాజేశాడు.

ఆన్‌లైనులో కూలర్‌ను అమ్మకానికి ఉంచిన సత్యసాయి అనే వ్యక్తికి ఓ అపరిచితుడు ఫోన్‌చేసి రూ.7 వేలుకు కూలర్‌ కొనుగోలు చేస్తానన్నాడు. డబ్బులు ఇస్తానని ఓ క్యూఆర్‌ కోడ్‌ను వాట్సాప్‌లో పంపి.. స్కాన్‌ చేయమన్నాడు. చేసిన వెంటనే సత్యసాయి ఖాతాలోంచి రూ.7 వేలు పోయాయి. అడిగితే.. పొరపాటు జరిగిందని ఈసారి మళ్లీ కోడ్‌ పంపిస్తానన్నాడు. ఇలా మొత్తం రూ.21 వేలు కాజేశాడు.

వారు కంటికి కనిపించరు. మాటలు కలిపి.. వివరాలు తెలుసుకుంటారు. ఖాతాలోకి ప్రవేశించి క్షణాల్లో దోచేస్తారు. సాంకేతిక పరిజ్ఞానం పెట్టుబడిగా ఇటీవల కొందరు ఆన్‌లైన్‌ మోసాలతో పేట్రేగిపోతున్నారు. ఈ తరహా మోసాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

కేవైసీ పేరుతో..

మీ బ్యాంకు ఖాతా నంబరుకు ఆధార్‌ అనుసంధానం లేదు. కేవైసీ అప్‌డేట్‌ చేయాలి. లేదంటే ఖాతా బ్లాక్‌ అవుతుందని అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేస్తాడు. వెంటనే వివరాలు అడుగుతాడు. మొబైల్‌కి వచ్చే ఓటీపీ చెప్పమంటాడు. చెప్పేశామంటే.. ఆ వెంటనే మన బ్యాంకు ఖాతాలోంచి నగదు మాయం చేసేస్తాడు.

మనమేం చేయాలి..

ఈ తరహా మోసంలో మొదట మనం గుర్తించాల్సింది ఏ బ్యాంకు అధికారులు, సిబ్బంది ఖాతాదారులకు ఫోన్‌చేసి వివరాలు అడగరు. ఒకవేళ అలాంటి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయంటే అవి మోసగాళ్ల నుంచే అని గ్రహించాలి. వాళ్లు అడిగే సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. గట్టిగా ఎదురుప్రశ్నించాలి.

కేవైసీ అప్‌డేట్‌ చేసేందుకు బ్యాంకు ఖాతా వివరాలు తెలపాలని ఆర్యాపురానికి చెందిన బి.రమేష్‌బాబుకు ఓ వ్యక్తి ఫోన్‌ చేశారు. అతని మాటలు నమ్మిన రమేష్‌ ఓటీపీతోసహా వివరాలన్నీ అందించారు. గంట వ్యవధిలో రమేష్‌ బ్యాంకు ఖాతాలోంచి రూ.5 లక్షలు మాయమయ్యాయి.

రుణాల పేరిట మోసాలు

చిన్న పాటి రుణాల పేరిట జరిగే మోసాల్లో తొలుత సైబర్‌ నేరగాడు మీకు రూ.3,500 రుణం కావాలంటే ఎలాంటి జామీను లేకుండా ఇస్తామని ఓ లింకు పంపుతారు. ఆ లింకును నొక్కగానే మన మొబైల్‌లో ఉన్న డేటా మొత్తం సైబర్‌ నేరగాడికి వెళ్తుంది. అక్కడ నుంచి ఎప్పుడైనా మీరు మోసపోవచ్చు.

ఆన్‌లైన్‌లో రూ.అయిదు లక్షల రుణం ఇస్తామని రాజమహేంద్రవరానికి చెందిన కె.సత్యనారాయణకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. రుణం మంజూరుకు ఛార్జీలుగా రూ.50 వేలు జమ చేయాలనడంతో నమ్మిన సత్యనారాయణ ఆ మొత్తం జమ చేశారు. మర్నాడు ఫోన్‌చేసి మరో రూ.లక్ష జమచేస్తేనే రుణం వస్తుందనడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు.

మనమేం చేయాలి

ఇలా వచ్చే లింకులను షార్ట్‌ యూఆర్‌ఎల్‌ అంటారు. లింక్‌ను నేరుగా క్లిక్‌ చేయకూడదు. దాన్ని కాపీ చేసి పూర్తి యూఆర్‌ఎల్‌ కోసం వెతికితే అది అసలో, నకిలీనో తేలిపోతుంది.

లాటరీ పేరిట వల..

లాటరీ బంపర్‌ డ్రాలో ప్రైజ్‌ మనీ, కారు గెలుచుకున్నారని ఈ-మెయిల్, ఫోన్‌లకు సమాచారం పంపుతారు. తొలుత ప్రైజ్‌ మనీ, కారు విలువలో ఒక శాతం పన్ను చెల్లిస్తే బహుమతి మీకు చేరుతుందని చెబుతారు. అది చెల్లించిన తర్వాత మరో రెండు శాతం ఇతర పన్నులని అంటారు. నమ్మే వారుంటే.. ప్రైజ్‌ మనీ, కారు విలువలో సగం డబ్బును పన్నుల పేరిట వసూలు చేస్తారు.

మనమేం చేయాలి..

ఎవరైనా ఫోన్‌ చేసి బంపర్‌ డ్రాలో కారు, లాటరీ గెలుచుకున్నారని చెప్పినా, +92 తరహాలో విదేశీ నంబర్లతో ఫోన్లు వచ్చినా వాటికి సమాధానం ఇవ్వకపోవడం మంచిది.సీటీఆర్‌ఐ ప్రాంతానికి చెందిన ఎం.అభిషేక్‌ ఆన్‌లైన్‌లో బూట్లు కొనుగోలు చేశాడు. ఓ కూపన్‌ బహుమతిగా వచ్చింది. కూపన్‌పైనున్న నంబరుకు ఫోన్‌ చేసిన అతనికి లక్కీ డ్రాలో కారు బహుమతిగా ఇస్తామంటూ చెప్పి పలు రకాల పన్నుల పేరిట అయిదు రోజుల్లో రూ.1.3 లక్షలను ఖాతా నుంచి లాగేశారు. మరోసారి రూ.15 వేలు చెల్లించాలనడంతో అనుమానం వచ్చి నిలదీస్తే.. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు.

online cheating
కంటికి కనిపించకుండా కొల్లగొడుతున్నారు

అప్రమత్తతతోనే అడ్డుకట్ట

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పదేపదే చెబుతున్నా.. నేరగాళ్ల మాటలు సులువుగా నమ్మి మోసపోతున్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్‌చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వారికి వివరాలు చెప్పవద్ద్దు. అవసరమనుకుంటే బ్యాంకుకు నేరుగా వెళ్లి అధికారులను సంప్రదించండి. ఓటీపీలు చెప్పడం, లింకులను క్లిక్‌ చేయడం వంటివి వద్దేవద్దు. మొబైల్‌లో అవసరం ఉన్నప్పుడే ఇంటర్నెట్‌ ఆన్‌ చేసుకోవడం మంచిది. ఏపీ పోలీసు సేవ యాప్‌లో సైబర్‌ నేరాలపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలుంటాయి. - జి.గురునాథ్‌బాబు, డీఎస్పీ, రాజమహేంద్రవరం అర్బన్‌ క్రైమ్‌

ఇదీ చదవండి: అవినీతి చేయకూడదనే సినిమాల్లో నటిస్తున్నా : పవర్ స్టార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.