తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెం బీచ్ వద్ద ఓఎన్జీసీ పైపుల నుంచి చమురు చోరీ చేస్తున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముడిచమురును దొంగిలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 170 లీటర్ల చమురు స్వాధీనం చేసుకున్నారు. వీరిని త్వరలోనే కోర్టులో హాజరు పరచనున్నట్లు అమలాపురం డీఎస్పీ షేక్ మాసూం బాషా తెలిపారు.
ఇవీ చదవండి...