ETV Bharat / state

ఉచ్చులవారిపేటలో కరోనా పాజిటివ్​.. కంటెయిన్​మెంట్​ జోన్​లోకి 53 కుటుంబాలు

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఉచ్చుల వారి పేటకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నమోదు కావడం అప్రమత్తమైన అధికారులు 53 కుటుంబాలను కంటెయిన్​మెంట్​ జోన్​లో ఉంచినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఒకే కుటుంబంలోని ఐదుగురికి కరోనా నిర్ధరణ కావడం స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

one more corona case recorded
ఉచ్చులవారిపేటలో కరోనా పాజిటివ్
author img

By

Published : Jul 2, 2020, 5:51 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఉచ్చులవారిపేటకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో 53 కుటుంబాలను కంటెయిన్​మెంట్​లో ఉంచినట్లు ఎస్సై జి.సురేంద్ర వెల్లడించారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. పంచాయతీ సిబ్బంది గ్రామ వాలంటీర్లు, రెవెన్యూ, ఆరోగ్య శాఖ సిబ్బంది నివారణం చర్యలు చేపట్టారు.

రాజుల ఏనుగుపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరికి వైద్య సేవలు అందించి ఇరవై రోజుల అనంతరం నిర్వహించిన పరీక్షల్లో ముగ్గురికి నెగిటివ్ ఫలితాలు వచ్చినట్లు వైద్యాధికారి కే.సుబ్బరాజు వెల్లడించారు. మండలంలో క్రమేపీ కరోనా కేసులు పెరుగుతుండడం ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చూడండి...

కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.