తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కరోనా పరీక్షల కోసం వచ్చిన ఓ వృద్ధుడు ఆకస్మికంగా మృతి చెందాడు. అమలాపురం పట్టణానికి చెందిన 70 సంవత్సరాల వృద్ధుడు సంచార సంజీవని కరోనా పరీక్షా కేంద్రం వద్దకు వచ్చాడు. అప్పటికే అక్కడ చాలామంది వేచి ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి వృద్ధుడు కుప్ప కూలిపోయాడు.
అతని మృతదేహాన్ని బంధువులు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశారు. అమలాపురం ఆర్టీవో భవాని శంకర్ ఆదేశాల మేరకు మృతదేహానికి అక్కడే కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ వృద్ధుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్ధరించారు. ఈ సంఘటనతో అక్కడివారంతా బిత్తరపోయారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 2432 కరోనా కేసులు.. 44 మంది మృతి