కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని బోడసకుర్రులో కొవిడ్ కేర్‌సెంటర్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఇక్కడి టిడ్కో భవనాలను గత ఏడాది కొవిడ్ కేర్ సెంటర్‌గా వినియోగించారు. అప్పట్లో కరోనా ప్రభావం తగ్గుతుండటంతో దాన్ని మూసివేశారు. ప్రస్తుతం కేసులు పెరుగుతుండటంతో తిరిగి ప్రారంభించారు. ఇప్పుడు ప్రస్తుతం వెయ్యి పడకలను సిద్ధం చేశామని.. అవసరం అనుకుంటే మరో వెయ్యి పడకలు సిద్ధం చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ సెంటర్లో పనిచేసే సిబ్బందికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించారు.
ఇదీ చదవండీ.. విశాఖ ఉక్కు ఘనత: 12 రోజుల్లో 1,300 టన్నుల ఆక్సిజన్