తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో మొట్టమొదటి సారిగా 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కారణంగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులంతా పట్టణంలోని పెద్ద వీధి, పండావీధులకు చెందిన వారు అయిన కారణంగా... ఆ ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు.
గొల్లప్పరావు సెంటర్ నుంచి రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు మార్గాన్ని మూసి వేశారు. లాక్డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు. ఈ ముగ్గురు ఎవరెవరిని కలిశారు... ఎక్కడెక్కడ తిరిగారు అన్నది ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: