తూర్పుగోదావరి జిల్లా ఒమ్మంగిలో నూకాలమ్మ జాతర వేడుకగా ప్రారంభం అయింది. ఈ ఉత్సవంలో గరగ నృత్యాలు, దేవత మూర్తుల వేష ధారణలు, పౌరాణిక ఘట్టాల ముఖ్య సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ వేడుకలో అర్ధరాత్రి సమయంలో రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడం గమనార్హం. ఈ నృత్యాలతో పాటూ గుండాటలు సైతం జోరుగా కొనసాగాయి.
ఇదీ చదవండి: