ETV Bharat / state

తూర్పుగోదావరిని తేరుకోనివ్వని తుపాన్లు

తుపాను గాయాలతో తల్లడిల్లుతున్న తూర్పుగోదావరి రైతులను నివర్‌ తుపాను దెబ్బ మీద దెబ్బ తీసింది. గత విపత్తుల నుంచి గట్టేక్కాలనే ఆశతో సాగుచేసిన పైర్లను..తుడిచిపెట్టింది. తూర్పు గోదావరి జిల్లాలో సుమారు లక్షా 40 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు.. ప్రాథమిక అంచనా వేశారు.

damage of crops
damage of crops
author img

By

Published : Nov 28, 2020, 6:03 AM IST

తూర్పుగోదావరిని తేరుకోనివ్వని తుపాన్లు

తూర్పుగోదావరి జిల్లాపై తుపాన్లు పగబట్టినట్లే కనిపిస్తోంది. ఈ ఏడాది వరుస తుపాన్లు, గోదావరి, ఏలేరు వరదలు అన్నదాతను కోలుకోలేని దెబ్బతీశాయి. వాటి నుంచి తేరుకోకముందే వచ్చిన నివర్‌ తుపాను కూడా నష్టపరిచింది. కోనసీమ సాగును ఈదురుగాలులతో కూడిన వర్షం కకావికలం చేసింది. వరితో పాటుప్రధాన పంటలు నీట మునిగాయి. అమలాపురం డివిజన్‌లోని మలికిపురం, సఖినేటిపల్లి, రాజోలు, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాల్లో వరి పంట నేలవాలింది. మరికొన్ని చోట్ల కోత కోసిన వరి కుప్పలు తడిశాయి.

కాకినాడ డివిజన్‌లోనూ తుపాను తీరని నష్టాన్ని మిగిల్చింది. వేల ఎకరాల్లో పంట నేల కొరిగింది. కుప్పలేసిన, ఆరబెట్టిన ధాన్యంతోపాటు కోతకు వచ్చిన పంట కూడా నేలమట్టమైంది. ధాన్యం మొలకలు రావడంతో కనీసం బస్తా 5 వందలకైనా కొనేవారు లేరని వాపోతున్నారు.

ఇదీ చదవండి : నివర్‌ ధాటికి అతలాకుతలం...స్తంభించిన జనజీవనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.