ETV Bharat / state

"తీర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలతో పర్యావరణానికి ప్రమాదం.."

తూర్పుగోదావరి జిల్లా రాజోలులో అక్రమంగా చేపడుతున్న రొయ్యల చెరువుల తవ్వకాలు.. పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని ఎన్జీటీ సంయుక్త నిపుణుల కమిటీ తెలిపింది. ఈ విషయంపై జాతీయ హరిత త్రిసభ్య ధర్మాసనానికి.. ఎన్జీటీ నివేదిక సమర్పించింది.

NGT Joint Expert Committee
"తీర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాల కారణం పర్యవరణం దెబ్బతింటునది నిజమే"
author img

By

Published : Mar 2, 2021, 3:35 PM IST

రాజోలు సాగరతీరంలో నిబంధనలకు విరుద్ధంగా రొయ్యల చెరువులు తవ్వడంతో పర్యావరణానికి విఘాతం కలగుతోందని ఎన్జీటీ సంయుక్త నిపుణుల కమిటీ తెలిపింది. దీనిపై పూర్తి స్థాయి నివేదికను జాతీయ హరిత త్రిసభ్య ధర్మాసనానికి సమర్పించింది. తీరంలో యధేచ్ఛగా ఇసుక తవ్వకాలు, అక్రమ రొయ్యల చెరువుల ఏర్పాటుపై.. సఖినేటిపల్లి మండలానికి చెందిన యనమల వెంకటపతిరాజు ఎన్జీటికి ఫిర్యాదు చేశారు.

ఈ కారణంగా డిసెంబర్​లో.. మామిడికుదురు, సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో నిపుణుల బృందం పర్యటించింది. దీనికి సంబంధించిన నివేదికను ఎన్జీటీకి తాజాగా సమర్పించింది. సముద్ర తీర పరిధిలో ఐదేళ్లకోసారి రెన్యువల్ లేకుండా ఆక్వా చెరువులు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. 5 హెక్టర్లు దాటిన చెరువులకు వ్యర్థ జలాల శుద్ధి చేసే ప్రక్రియ.. అందుబాటులో ఉండాలనే నిబంధన ఉన్నా ఎక్కడా పాటించడంలేదని పేర్కొన్నారు. సముద్రపు ఇసుక తవ్వకాలకు భూగర్భ గనుల శాఖ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని వివరించిందని జాయింట్ కమిటీ సభ్యులు ఎన్జీటికి నివేదించారు. ఇసుక తవ్వకాలకు ఆస్కారం లేకుండా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని సభ్యులు నివేదికలో పేర్కొన్నారు.

ఇదీ చదవండీ.. పత్తి మందారం.. పూటకో వర్ణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.